
మాదాపూర్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని శేరిలింగంపల్లి సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వివేకానందనగర్ డివిజన్లోని పలు కాలనీల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.9 వేల కోట్లతో శేరిలింగంపల్లిలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.