హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌కి కోటి ఫైన్

హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌కి కోటి ఫైన్

తనఖా షేర్ల స్వాధీనంపై సీరియస్

రూ.159 కోట్లను వడ్డీతో సహా కట్టండి..

ఎస్క్రో అకౌంట్‌‌లో డిపాజిట్ చేయాలని ఆదేశం

న్యూఢిల్లీ: బీఆర్‌‌‌‌హెచ్‌‌ వెల్త్ క్రియేటర్స్ కేసులో భాగంగా రూ.158.68 కోట్ల రూపాయలను వడ్డీతో సహా ఎస్క్రో అకౌంట్‌‌లో జమ చేయాలని హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ను సెబీ ఆదేశించింది. అదేవిధంగా రెగ్యులేటర్స్ ఇంటెరిమ్ ఆర్డర్లను ఉల్లంఘించి, స్టాక్ బ్రోకర్ బీఆర్‌‌‌‌హెచ్‌‌ వెల్త్ క్రియేటర్స్ తనఖా పెట్టిన షేర్లను స్వాధీనం చేసుకున్నందుకు గాను కోటి రూపాయల పెనాల్టీ కట్టాలని కూడా ఆదేశించింది. ఎస్క్రో అకౌంట్‌‌కు ఈ మనీని డిపాజిట్ చేయాలని పేర్కొంది. ఎస్క్రో అకౌంట్ అనేది థర్డ్ పార్టీ అకౌంట్. ఇద్దరి మధ్య  సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నిర్వహించే అకౌంట్.   ‘2019 అక్టోబర్ 14 నుంచి ఇప్పటి వరకు ఏడాదికి 7 శాతం వడ్డీతో పాటు రూ.158.68 కోట్లను ఏదైనా జాతీయ బ్యాంక్‌‌లో సెబీ తరఫున ఎస్క్రో అకౌంట్‌‌లో డిపాజిట్ చేయాలి.  క్లయింట్స్ సెక్యూరిటీస్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ అకౌంట్‌‌ను నిర్వహించాలి’ అని హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌కు ఆదేశాలు వచ్చినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో తెలిపింది. బీఆర్‌‌‌‌హెచ్‌‌ వెల్త్ క్రియేటర్స్ తనఖా పెట్టిన రూ.158.68 కోట్ల విలువైన సెక్యూరిటీలను హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ 2019 అక్టోబర్ 14న స్వాధీనం చేసుకున్నట్టు సెబీ గుర్తించింది.  వీటిలో చాలా సెక్యూరిటీలను అమ్మేసింది కూడా. బీఆర్‌‌‌‌హెచ్‌‌కు అందించిన క్రెడిట్ ఫెసిలిటీస్‌‌లో భాగంగా హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ ఈ సేల్ నిర్వహించింది. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ బీఆర్‌‌‌‌హెచ్‌‌కు రూ.191.6 కోట్లను, బీఆర్‌‌‌‌హెచ్ కమోడిటీస్‌‌కు రూ.26.61 కోట్లను ఇచ్చింది. స్టాక్ బ్రోకర్ బీఆర్‌‌‌‌హెచ్ మార్కెట్‌‌లో ఎలాంటి షేర్లను కొనడానికి లేదా అమ్మడానికి వీలులేదంటూ ఇంటెరిమ్ ఆర్డర్లు జారీ చేసిన సెబీ.. తనఖా షేర్లను కూడా అమ్మొద్దని హెచ్చరించింది. కానీ ఈ ఆర్డర్ తర్వాత హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ తన క్రెడిట్ ఫెసిలిటీలను రాబట్టుకోవడానికి తనఖా షేర్లను విక్రయించింది. అంతేకాక క్లయింట్స్‌‌కు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తనఖా షేర్లను బ్యాంక్ స్వాధీనం చేసుకుంది.

ఫైన్‌‌తో పడిన బ్యాంక్ షేర్లు..

రెగ్యులేటర్స్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను సెబీ పెనాల్టీ విధించడంతో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌‌లో 2 శాతం వరకు పడిపోయాయి. బీఎస్‌‌ఈలో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లు 2.05 శాతం తగ్గి రూ.1,443.65గా నమోదయ్యాయి. ఇంట్రాడేలో రూ.1,440.7 వద్ద కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అదేవిధంగా నిఫ్టీలో కూడా స్టాక్ 2.06 శాతం తగ్గి రూ. 1,444.35 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.1,440.15 వద్ద కనిష్ట స్థాయిలకు పడింది.

ఆర్‌‌‌‌బీఐ వద్దకు హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ ప్లాన్…

మూడు నెలల్లో తమ టెక్నాలజీ ప్లాట్‌‌ఫామ్‌‌ను మెరుగుపరుస్తామని తెలుపుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌‌ ఇండియా(ఆర్‌‌‌‌బీఐ)కి హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ తన ప్లాన్‌‌ను అందజేసింది. తరచుగా వస్తోన్న సర్వీసు అంతరాయాలను, టెక్నికల్ సమస్యలను అడ్రస్ చేస్తూ ఈ ప్లాన్ ఉంది. ఈ యాక్షన్ ప్లాన్‌‌ను అమలు చేసేందుకు 10 నుంచి 12 వారాల సమయం పడుతుంది. ఆర్‌‌‌‌బీఐ తనిఖీ ప్రకారం తదుపరి టైమ్‌‌ ఫ్రేమ్ ఆధారపడి ఉంటుంది. ఆర్‌‌‌‌బీఐ ఈ ప్లాన్‌‌కు ఆమోదం తెలిపితేనే.. బ్యాన్‌‌ను ఎత్తివేయడం కుదురుతుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

ఉద్యోగాల ఖాళీలు అర లక్ష.. సమస్యలు సవాలక్ష