ఆసిఫాబాద్​ కలెక్టర్​ను బదిలీ చేయాలె

ఆసిఫాబాద్​ కలెక్టర్​ను బదిలీ చేయాలె

ఆసిఫాబాద్​ కలెక్టర్​ను బదిలీ చేయాలె

ఆదివాసీలను చంపేందుకు పోడు భూముల్లోకి పులులను వదులుతున్నారు

కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో బీఎస్పీ స్టేట్​ చీఫ్​ ప్రవీణ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు : టీఆర్ఎస్ గవర్నమెంట్ పోడు భూముల్లోకి పులులను పంపి వారిని చంపాలని చూస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టర్ ను బదిలీ చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా మహాధర్నా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రవీణ్​కుమార్​మాట్లాడుతూ ఐపీఎస్​ఆఫీసర్​గా 26 ఏండ్ల పాటు పని చేసిన తాను ఈరోజు ఓ ఐఎఎస్ కు వ్యతిరేకంగా ధర్నా చేయాల్సి రావడం బాధాకరమన్నారు. ‘సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కోనప్పకు భయపడుతున్నారా ..రాజ్యం మారినప్పుడు అన్ని అక్రమాలు బయటకు తీస్తా. అప్పుడు ఎవరు రక్షిస్తారో ఆలోచించాలి’ అని కలెక్టర్ కు హితవు పలికారు.  

జిల్లాలో ప్రజలకు పంచాల్సిన ఎనిమిది వేల టన్నుల బియ్యాన్ని అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపించారు. రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్లు దుప్పట్లు లేక చలికి వణుకుతున్నా ఈ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం పోడు పట్టాలిస్తామని చెబుతూ చేస్తున్న సర్వే ఎమ్మెల్యే అనుచరులకే మేలు చేస్తోందన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో డంపింగ్ యార్డు భూములను కూడా వదలకుండా ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు , నాయకులు రాథోడ్ శేషారావు, మర్సుకోల సరస్వతి , గణేష్ రాథోడ్ ,బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్, జిల్లా నాయకులు పొన్నాల నారాయణ, అర్షద్ హుస్సేన్, టీడీపీ రాష్ట్ర నాయకుడు ఆనంద్, విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆత్మకూరి చిరంజీవి, దుర్గం దినకర్ ,గొడిసెల కార్తీక్ పాల్గొన్నారు.