
బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేశారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉద్యోగులకు జీతాలివ్వడానికి డబ్బుల్లేవా అని మంత్రి హరీశ్ రావును ట్విట్టర్లో ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో బహుజన యాత్రలో భాగంగా మాట్లాడిన ఆయన.. అడవుల్లో ప్రాణాలకు తెగించి ఉద్యోగం చేసే వాచర్లకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదని ఆరోపించారు.
‘పులులు సంచరించే దట్టమైన అడవుల్లో ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసే ఇలాంటి వేలాది మంది వాచర్లకు గత మూడు నెలల నుండి జీతాలు లేవు. 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర పైసలు లేవా?’ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.