నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ చేస్తున్నారు

V6 Velugu Posted on Aug 04, 2021

  • రాజప్రసాదాలకు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి

ప్రభుత్వ రాజప్రసాదాలకు పవర్ కట్ చేసే రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. తాను పాల్గొన్న సభలలో.. తాను మాట్లాడే సమయంలోనే కావాలనే పవర్ కట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా తనతో మాట్లాడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

‘ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడి చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి’ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. 

 

Tagged Hyderabad, Telangana, power cut, RS praveen kumar

Latest Videos

Subscribe Now

More News