వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తాం

వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తాం

నల్లగొండ: బహుజన రాజ్యాధికారం కోసం పేద ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన మొదలుపెట్టిన ‘బహుజన రాజ్యాధికార యాత్ర’  19వ రోజు నార్కట్‎పల్లి మండలంలో సాగుతోంది. ఈ సందర్భంగా అక్కినపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘బహుజన రాజ్యాధికారం కోసం పేద ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బంగారు తెలంగాణ కాదు.. బాధల తెలంగాణగా మార్చారు. మంత్రుల జీతాలు ప్రతి నెల ఒకటవ తారిఖున వస్తున్నాయి.. కానీ పింఛన్ ఈ రోజు 24 తారీఖు వరకు కూడా ఇవ్వలేదు. యాసంగి వడ్ల కొనుగోలు బంద్ చేశారు. ఎన్నికల కోసం కేసీఆర్ వడ్ల డ్రామా ఆడుతున్నారు. ప్రాజెక్టులు నిర్మించి వడ్లు కొనుగోలు చెయ్యకపోతే లాభం ఏంటి?  డిస్కంలకు తెలంగాణ రాష్టం  17 వేల కోట్ల బాకీ ఉంది. అందుకే రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెంచారు. రాష్ట్ర భారాన్ని పేదల మీద రుద్దడం హేయమైన చర్య. విద్యుత్ కొనుగోలు  చీకటి ఒప్పందంగా కనిపిస్తోంది. పేద ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి. నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. కనీస సౌకర్యాలు లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేస్తున్నాం. చట్టసభల్లోకి బీసీలను తీసుకొచ్చేందుకే బీఎస్పీ కృషి చేస్తది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తాం.  సీఎం కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ చెయ్యలేదు కానీ బంగారు భారత్ అంటున్నారు. బంగారు తెలంగాణ ఏమో కానీ అవినీతి ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ప్రజల విశ్వసనీయత కోల్పోయారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. రూ. 600 కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్‎ను ఎందుకు తెచ్చుకున్నాడు’ అని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు.

For More News..

రా రైస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె

తెలంగాణను బెంగాల్‎గా మార్చొద్దు

పెట్రో రేట్ల పెరుగుదల బీజేపీ ఆడుతున్న గేమ్

ఏపీ సీఎం జగన్‎కు నాంపల్లి కోర్టు సమన్లు