ఖదీర్ ఖాన్‭ను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలె: ప్రవీణ్ కుమార్

ఖదీర్ ఖాన్‭ను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలె: ప్రవీణ్ కుమార్

బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం పై మండిపడ్డారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిని ప్రాణాలు కోల్పోయిన ఖదీర్ ఖాన్ మృతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన ఇంట్లో కుక్క పిల్లకు ఇచ్చే విలువను నిరుపేదలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. తన ఇంట్లో హస్కీ అనే కుక్కపిల్ల చనిపోతే.. డాక్టర్ పై కేసు పెట్టిండని గుర్తు చేశారు. మెదక్‭లో బహుజన బిడ్డ ఖదీర్ ఖాన్‭ను పోలీసులు కొట్టి చంపినా దీనిపై కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. మీ కుక్కపిల్లల కన్నా నిరుపేద బతుకులు అంత హీనమా అని కేసీఆర్‫ను ప్రశ్నిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.  

ఖదీర్ ఖాన్ మృతికి కారకులైన పోలీసు సిబ్బందిపై ఐపీసీ 302 కింద మర్డర్ కేసు నమోదు చేయాలని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అనుమానం పేరుతో పోలీసులు పేదలపై బలప్రయోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం గొలుసు చోరీ అనుమానంతోనే గతంలో మరియమ్మ అనే మహిళను, ఇప్పుడు ఖదీర్ ఖాన్ లాంటి పేద బహుజనుల ప్రాణాలు తీస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.