రాకేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాకేష్  కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సికింద్రాబాద్ కాల్పుల ఘటనలో మృతిచెందిన దామెర రాకేష్ కుటుంబ సభ్యులను  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు.  రాకేష్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రుల పైన ప్రవీణ్ కుమార్ విమర్శలు చేశారు.  కేసీఆర్ ఫామ్ హౌజ్ నుండి బయటకు రావడం లేదని, కేసీఆర్ పర్మిషన్ లేకుండా మంత్రులు ఎవరు కూడా మాట్లాడరని విమర్శించారు. రాకేష్ మృతి పై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు .  ఈ ఘటనలో ఎక్కడ వైఫల్యం జరిగిందో, దీనికి బాధ్యులెవరో  తేల్చాలని అన్నారు. ఇక ఆర్మీ అభ్యర్థులందరీకీ న్యాయం జరగాలని, కేసుల విషయంలో పున సమీక్షించుకోవాలని, వారి భవిష్యత్తును ఆగం చేయవద్దని ప్రవీణ్ కుమార్ కోరారు.