36 ఏళ్లు లేవు.. రూ.7 కోట్ల అవినీతి.. 20 కార్లు, 100 కుక్కలు

36 ఏళ్లు లేవు.. రూ.7 కోట్ల అవినీతి.. 20 కార్లు, 100 కుక్కలు

చురుకైన అమ్మాయి.. మంచి టాలెంట్ ఉండటంతో.. చిన్న వయస్సులోనే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో కనర్ స్ట్రక్షన్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు హేమ మీనా. నెల జీతం ఎంతో తెలుసా.. 30 వేల రూపాయలు మాత్రమే.. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత సంపాదించింది ఎంతో తెలుసా అక్షరాల 7 కోట్ల రూపాయలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే చిన్న వయస్సులోనే ఇంత పెద్ద అవినీతి చేసిన అధికారిణిగా రికార్డుకెక్కారు మీనా. మూడేళ్ల క్రితం అంటే 2020లోనే హేమ మీనాపై లోకాయుక్తకు కంప్లయింట్స్ వచ్చాయి.. అప్పటి నుంచి నిఘా పెట్టిన అధికారులు.. 2023 మే 11వ తేదీ ఆమె ఇంటిపై దాడులు చేశారు. 

తనిఖీ చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం షాక్ అయ్యారు. ఆమె ఇంట్లో 20 కార్లు ఉన్నాయి. అంతేనా 98 ఇంచ్ ల టీవీ ఉంది.. దాని ఖరీదు ఎంతో తెలుసా 30 లక్షల రూపాయలు.. వంద కుక్కలను పెంచుతోంది. దాని కోసం ఏకంగా ఓ షెడ్డు వేసింది. ఆవులు, బర్రెలు కూడా ఉన్నాయి. 20 వేల చదరపు గజాల వ్యవసాయ భూమిని సైతం గుర్తించారు అధికారులు. అంతేనా.. ప్రస్తుతం హేమ మీనా ఉంటున్న ఇంటి ఖరీదు కోటి రూపాయలపైనే ఉంటుంది. కొన్ని ఆస్తులు తన తండ్రి పేరుతో రిజిస్ట్రర్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఆమె ఏడు కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు అధికారులు.అది 232 శాతంపైనే ఉందని  వెల్లడించారు అధికారులు. 

30 వేల రూపాయల జీతంతోనే.. హేమ మీనా ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించింది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఉద్యోగం చేరినప్పటి నుంచి అవినీతికి పాల్పడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు కంప్లయింట్స్ కూడా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆధారాలు కోసం టైం తీసుకున్నామని వెల్లడించారు. ఎంత అవినీతి సొమ్ము ఉంటే మాత్రం.. 100 కుక్కలను ఎలా పెంచుతున్నారనేది సంచలనంగా మారింది. 30 లక్షల రూపాయల టీవీ కొనుగోలు చేశారంటే.. ఏ రేంజ్ లో కాంట్రాక్టర్ల నుంచి దోచుకున్న తిన్నారో అనేది ఆసక్తికరంగా మారింది. చిన్న వయస్సులోనే ఉద్యోగంలో చేరటమే కాదు.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెత తరహాలో.. ఎడాపెడా సంపాదించేసింది మేడమ్ గారు..