రామాలయం అభివృద్ధికి తొలిదశలో రూ.350 కోట్లు.. శ్రీరామనవమి రోజున శంకుస్థాపన చేయనున్న సీఎం

రామాలయం అభివృద్ధికి తొలిదశలో రూ.350 కోట్లు.. శ్రీరామనవమి రోజున శంకుస్థాపన చేయనున్న సీఎం

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా తొలి దశలో రూ.350 కోట్లతో పనులు చేపట్టేందుకు యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రెడీ అయింది. ఆలయ అభివృద్ధిపై ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లాకు చెందిన మంత్రులు ప్రత్యేక సమావేశం నిర్వహించి, మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌పై చర్చించడంతో పాటు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి వివరించారు. 

మొత్తం రూ.560 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తొలి దశలో ప్రాకారాలు, మాడవీధులు, అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ తదితర పనులు చేపట్టనుండగా.. మిగిలిన రెండు దశల్లో భద్రాచలం పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. 

మొదటి దశ పనులను ఈ నెల 27న శ్రీరామనవమి రోజున ప్రారంభించనున్నారు. సీతారాముల కల్యాణం సందర్భంగా ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొచ్చే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.