చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ వాహనాలు, ఓవర్ లోడ్ వాహనాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రూల్స్ అతిక్రమించి పరిమితికి మించి ప్రయాణికులతో ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యప్తంగా ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లపై తిరుగుతున్న వాహననాలపై కొరడా ఝులిపిస్తున్నారు. టాక్స్ చెల్లించని, ఫిట్నెస్ లేని, ఇన్సూరెన్సు లేని వాహనాలను తనిఖీ చేశారు అధికారులు. ప్రతి వాహనదారులు టాక్స్ కట్టాలని, అధిక లోడ్ తో వాహనాలు నడపవద్దని కోరారు మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ (MVI) రామారావు. నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
