నర్సాపూర్, వెలుగు: ఆర్టీసీ బస్సును బోరు బండి ఢీకొట్టిన ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ వద్ద జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సాపూర్ పట్టణంలోకి వెళ్తున్న సమయంలో, హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న బోరు బండి ఎదురుగా వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

