గుండాల సమీపంలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

గుండాల సమీపంలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

గుండాల, వెలుగు :  ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన్న ఉన్న పొదాల్లోకి  దూసుకెళ్లింది. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల వద్ద బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు గుండాల మీదగా మేడారం వెళ్లి తిరిగి ఖమ్మం వెళ్తున్నది.

గుండాల సమీపంలో బస్సు అదుపుతప్పి రోడ్డు దిగి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి ఆగింది. ఆ సమయంలో బస్సులో 10 మంది మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.