
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ 1,2 డిపోలతో పాటు హుజురాబాద్ డిపో అద్దె బస్సు యజమానుల సంక్షేమ సంఘం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా నియమించుకున్నారు. కరీంనగర్ 1వ డిపోకు ప్రెసిడెంట్‌గా తుమ్మ సుధీర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా గాదె రాజు పటేల్ , కరీంనగర్ 2వ డిపోకు ప్రెసిడెంట్ గా గోలి సంపత్ పటేల్ , జనరల్ సెక్రటరీగా వెన్నం విజయభాస్కర్ రెడ్డి ఎన్నికయ్యారు. హుజురాబాద్ డిపోకు ప్రెసిడెంట్‌గా తాళ్ల పెళ్లి అనిల్ గౌడ్ , జనరల్ సెక్రెటరీగా గోపు విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు పాల్గొన్నారు.