
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీ జర్నీ చేసే విధివిధానాలపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడారు. పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. రేపు (డిసెంబర్ 9న) మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని సజ్జనార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇంకా ఏమన్నారంటే..
* ప్రజారవాణా వ్యవస్థలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం
* వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, వృద్ధులు జర్నీ చేయవచ్చు
* ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉంటే చాలు
* ఆధార్, ఓటర్, డ్రైవింగ్, పాన్ కార్డు, పాస్ పోర్టు, స్టేట్, సెంట్రల్ ఐడీకార్డులు చూపిస్తే చాలు
* రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు.. లిమిట్స్ లేవు..
* రోజుకు ఎన్నిసార్లైనా బస్సుల్లో జర్నీ చేసే అవకాశం
* మహాలక్ష్మీ స్కీమ్ తో ప్రజా రవాణా పుంజుకుంటుంది
* ఫ్రీ జర్నీపై ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
* వారం తర్వాత బస్సుల్లో మహిళలకు ఫ్రీ టికెట్ ఇస్తాం
* భవిష్యత్తులో ఆర్టీసీ సంస్థలో నియమాకాలు ఉంటాయి
* రద్దీకి తగ్గట్లు అందుబాటులోకి బస్సులను ఏర్పాటు చేస్తాం