
- రోడ్డు ప్రమాదంలో కండక్టర్ మృతి
- రూ.40 లక్షల చెక్కును అందజేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
మెదక్ టౌన్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో మరణించిన కండక్టర్కుటుంబానికి రూ.40 లక్షల చెక్కును టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం బాధిత కుటుంబ సభ్యలకు అందజేశారు. మృతి చెందిన కండక్టర్ సి.హెచ్.అంజయ్య మెదక్ డిపో కండక్టర్‌గా విధులు నిర్వహించే వారు. రోడ్డు ప్రమాదంలో అంజయ్య మృతి చెందారు.
దీంతో ఈ ఆపద సమయంలో యూబీఐ సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. సిబ్బంది, ఉద్యోగుల సాలరీ అకౌంట్స్‌ను ఇటీవల యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చింది. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాదబీమా సౌకర్యం ఉంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40 లక్షలు వరకు యూబీఐ అందజేస్తోంది.
ఈ సందర్భంగా ప్రమాదంలో మృతి చెందిన అంజయ్య కుటుంబానికి రూ.40 క్షల విలువైన చెక్కును యూబీఐ అధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అందచేశారు. రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండక్టర్ అంజయ్య భార్య మణెమ్మతో పాటు కుమారుడు సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. త్రిబుల్ రైడింగ్‌తో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా నిబద్దతతో విధులు నిర్వర్తించే అంజయ్య మరణించడం బాధాకరమని అన్నారు. సంస్థ సీఈవో డాక్టర్ వి.రవీందర్, ఈడీలు ఎస్.కృష్ణకాంత్, పీవీ మునిశేఖర్, పురుషోత్తం, సీపీఎం ఉషాదేవి, యూబీఐ జనరల్ మేనేజర్ కృష్ణన్, సిద్దిపేట రీజినల్ హెడ్ వికాస్, చీఫ్ మేనేజర్ రమేశ్, మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సుధా తదితర అధికారులు పాల్గొన్నారు.