‘రుద్రంగి’ నుంచి ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది

‘రుద్రంగి’ నుంచి ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది

బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు రైటర్‌‌‌‌గా పని చేసిన అజయ్ సామ్రాట్  దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రుద్రంగి’. జగపతి బాబు, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ, విమలా రామన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 

'త్యాగాలే నిను తలచి తలవంచి .. మొక్కాలే మా తల్లి నీకమ్మా, నవ్వేటి పువ్వులే గోసరిల్లి వసివాడిపోయెనే మా యమ్మా .. రుద్రంగి ' అంటూ ఈ పాట సాగుతోంది. నాఫల్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి మానుకోట ప్రసాద్ సాహిత్యాన్ని అందించగా, కైలాశ్ ఖేర్ ఆలపించాడు. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ కానుంది.