‘రుద్రంగి’.. గతంలో వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నం

 ‘రుద్రంగి’.. గతంలో వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నం

జగపతిబాబు ముఖ్యపాత్రలో అజయ్ సామ్రాట్ రూపొందించిన చిత్రం ‘రుద్రంగి’. మమత మోహన్ దాస్, విమల రామన్, గానవి లక్ష్మన్‌‌‌‌ ఇతర పాత్రల్లో నటించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నా చిన్నప్పుడు విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ఈ కథను రాసుకున్నా. ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి చెందిన కథ కాదు. తెలంగాణ నేపథ్యంలో తీశాం. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ, సోషల్ డ్రామా. దొరల అణిచివేతలపై గతంలో వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. 

జగపతిబాబు దీని కోసం చాలా కష్టపడ్డారు. ఆయన నన్ను ఎక్కువగా నమ్మారు. మమతా మోహన్ దాస్ గారు క్యాన్సర్ నుంచి కోలుకున్నాక వెళ్లి కథ వినిపించా. పదేళ్ల నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు, అప్రోచ్ అయినందుకు థాంక్స్ అని వెంటనే ఓకే చెప్పారు. అరవై రోజుల్లో షూటింగ్‌‌‌‌ను పూర్తి చేశాం. నేను గతంలో బాహుబలి, రాజన్న చిత్రాలకు డైలాగ్ రైటర్‌‌‌‌గా పని చేశాను. రాజమౌళితో నాకు ప్రొఫెషనల్‌‌‌‌గా పరిచయం ఉంది. ఆ విషయం చెప్పుకుని నన్ను నేను సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడం నచ్చదు. సినిమా నచ్చితే ‘కాంతార’ తరహాలో జనాలు ఆదరిస్తారనే నమ్మకముంది’ అన్నాడు.