'కాంతార : చాప్టర్ 1' కనకవతి వచ్చేసింది... యువరాణి లుక్ లో రుక్మిణి వసంత్

'కాంతార : చాప్టర్ 1' కనకవతి వచ్చేసింది... యువరాణి లుక్ లో రుక్మిణి వసంత్

హీరో రిషబ్ శెట్టి( Rishab Shetty ) స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ' కాంతార : చాప్టర్ 1 ' (  Kantara Chapter 1 ) .  ఇది 2022లో విడుదలపై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'కాంతార' కు ప్రీక్వెల్ గా వస్తోంది.  భారీ బడ్జెట్ తో తెరక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమౌతోంది.  ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ షూరూ చేస్తూ.. లేటెస్ట్ అప్డేట్ అందించారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో 'కనకవతి' ( Kanakavati )అనే కీలక పాత్రను మూవీ మేకర్స్ పరిచయం చేశారు. ఈ పాత్రలో రుక్మిణి వసంత్ (  Rukmini Vasanth ) నటిస్తున్నట్లు తెలుపుతూ ఫస్ట్ గ్లింప్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యువరాణి లుక్ లో కనిపిస్తున్న ఆమె పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు.  ఇప్పుడు ఈ కనకవతి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ చాప్టర్ 1లో  'కాంతర' కథకు ముందు ఏం జరిగింది అనే చూపించనున్నారు.  ప్రధానంగా బనవాసిని పాలించిన కదంబుల పాలన కాలం నాటి సంస్కృతి, సంప్రదాయలను ఈ ప్రీక్వెల్ లో హైలెట్ చేస్తూ తెరకెక్కించారు.  అతీత శక్తులు కలిగిన నాగ సాధువు పాత్రలో రిషబ్ శెట్టి కనిపించనున్నారు.  ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది.  సంగీతం బి. అజనీష్ లోక్ నాథ్, ప్రొడక్షన్ డిజైనర్ గా వినీష్ బంగాళన్ ,  సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ . కశ్యఫ్ అందించారు. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.

►ALSO READ | బిగ్ బాస్ 19 షోను తిరస్కరించిన బాలీవుడ్ నటి.. రూ.6 కోట్లు ఆఫర్‌ చేసినా..