బిగ్ బాస్ 19 షోను తిరస్కరించిన బాలీవుడ్ నటి.. రూ.6 కోట్లు ఆఫర్‌ చేసినా..

బిగ్ బాస్ 19 షోను తిరస్కరించిన బాలీవుడ్ నటి.. రూ.6 కోట్లు ఆఫర్‌ చేసినా..

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ( Salman Khan ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ' బిగ్ బాస్ 19' ( Bigg Boss 19 )   ఆగస్టు 24న  ప్రారంభం కానుంది.  ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ షోలో 'కాందహార్', 'టెహ్రాన్' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఎల్నాజ్ నోరూజీ ( Elnaaz Norouzi )పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ షోలో పాల్గొనేందుకు ఈ ఇరానియన్ బ్యూటీ తిరస్కరించినట్లు సమాచారం.

 ' బిగ్ బాస్ 19' హిందీ సీజన్ లో ఎల్నాజ్ నోరూజీకి నిర్వాహకులు సుమారు రూ.6 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ భారీ మొత్తాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు  టాక్ . ప్రస్తుతం ఈ నటి 'మస్తీ 4' షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. త్వరలో జాన్ అబ్రహంతో కలిసి యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'టెహ్రన్ ' లో కనిపించనుంది. ఈ క్రమంలో తన ఫోకస్ అంతా సినిమాలపైనే తప్పా డబ్బుపై కాదని తన సన్నిహితులతో చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

ALSO READ : COOLIE: భారీ రన్‌టైమ్‌తో యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’..

బిగ్ బాస్ అనేది విజిబిలిటీకి బిగ్గెస్ట్ ప్లాట్ ఫామ్ అయినప్పటికీ.. ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టుల విషయంలో రాజీపడదల్చుకోలేదని ఎల్నాజ్ నోరూజీ పేర్కొన్నట్లు సమాచారం.  కేవలం కీర్తి కంటే తన ప్రతిభకు గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యం.  మరో ఆరు నెలల పాటు సినిమా షూటింగ్ ఉన్నందున వాటిపైనే దృష్టి పెట్టినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. 

 ' బిగ్ బాస్ 19' సీజన్ కు సంబంధించిన ప్రోమోలను ఇప్పటికే నిర్వాహకులు విడుదల చేశారు. ఈసారి నడిచేసి - 'ఘర్‌వాలోం కీ సర్కార్' అంటూ  సల్మాన్ ఖాన్ ప్రకటన చేశారు.  వినోదం రెట్టింపు స్థాయిలో ఉంటుందని, "టూ మచ్ ఫన్" గ్యారంటీ అని హామీ ఇచ్చారు. ఈ ఉత్కంఠభరితమైన సీజన్ ఆగస్టు 24 నుంచి 'కలర్స్‌టీవీ'లో రాత్రి 10.30 గంటలకు ప్రసారం కానుంది. 'జియోహాట్‌స్టార్'‌లో 9 గంటల నుంచి  స్ట్రీమింగ్ అవ్వనుంది.