
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబీ 29’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తవగా, ఇప్పటివరకు ఈ చిత్రం గురించిన ఎలాంటి అప్‌డేట్‌ను అందించలేదు మూవీ టీమ్. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్‌డేకి మాత్రం కచ్చితంగా ట్రీట్ ఉంటుందనే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇంకా ఇరవై రోజులు ఉండగానే మహేష్ బర్త్‌డేకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. మరి ఈసారైనా మహేష్ అభిమానులకు బర్త్‌డే ట్రీట్ ఉంటుందా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా సినిమా విడుదలయ్యేలా సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.