ఒక వైపు లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా…మరో వైపు అవి కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. జార్జియాలో ఓ మహిళా జర్నలిస్టు పట్ల ఓ ఆకతాయి అసభ్యంగా ప్రవర్తించాడు. లైవ్ ప్రోగ్రాంలో నిర్వహిస్తుండగా ఆమెను వెనుకనుంచి తాకి వెళ్లిపోయాడు. లైవ్ లో ఉండగా జరిగిన అనుకోని చర్యతో ఆ జర్నలిస్టు షాక్ కు గురైంది.
జార్జియాలోని సవ్హానా ప్రాంతంలోని ఓ వంతెన దగ్గర ఓ కార్యక్రమంపై అవగాహనా కార్యక్రమం కోసం రన్ ర్యాలీ జరిగింది. ఇందులో అనేక మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీఎస్ఏవీ టీవీ జర్నలిస్టు అలెక్స్ బోజర్జియాన్ అనే మహిళా జర్నలిస్టు లైవ్‌లో కవర్ చేస్తోంది. అయితే, ఈ ర్యాలీలో పాల్గోనేందుకు వచ్చిన కొంత మంది టీవీలో కనపడాలనే ఉత్సాహంతో ఆ జర్నలిస్టు వెనుక నుంచి ‘హాయ్’ చెబుతూ వెళ్లారు. థామస్ కల్లావె అనే ఓ వ్యక్తి మాత్రం ఆమెను వెనుక టచ్ చేశాడు.
థామస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Check out this jerk smacking a @WSAV reporter's ass live on air. And sorry, that's my kiddo making horribly timed weird noises in the background. pic.twitter.com/6tzi6P1Jbo
— Tonya (@GrrrlZilla) December 7, 2019
