షాద్ నగర్ : రన్నింగ్ కారులో మంటలు

షాద్ నగర్ : రన్నింగ్ కారులో మంటలు

షాద్ నగర్, వెలుగు: రన్నింగ్​ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, పూర్తిగా దగ్ధమైంది. ఫరూఖ్​నగర్ మండలం గంట్లవెళ్లి గ్రామానికి చెందిన మిద్దె కృష్ణయ్య తన కారులో గురువారం పాపిరెడ్డిగూడ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఇంజిన్ నుంచి స్వల్పంగా మంటలు చెలరేగాయి. కృష్ణయ్య వెంటనే కారు నుంచి దిగి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు ఘటనాస్థలానికి చేరుకునేలోపే పూర్తిగా దగ్ధమైంది.