ఉక్రెయిన్పై బాంబులతో విరుచుకుపడిన రష్యా.. ఐదుగురు మృతి.. 20 మందికి గాయాలు

ఉక్రెయిన్పై బాంబులతో విరుచుకుపడిన రష్యా.. ఐదుగురు మృతి.. 20 మందికి గాయాలు

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడిం ది. శనివారం (అక్టోబర్ 04) అర్ధరాత్రి నుంచి ఆదివారం (అక్టోబర్ 05) తెల్లవారుజాము వరకు డ్రోన్లు, మిసైళ్లు, గైడెడ్  ఏరియల్  బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో లీవ్ సిటీలో నలుగురు పౌరులు చనిపోయారు. ఉక్రెయిన్​లోని మొత్తం 9 ప్రాంతాలపై 50 బాలిస్టిక్  మిసైళ్లు, 500 డ్రోన్లతో రష్యా అటాక్ చేసిందని అక్కడి అధికారులు చెప్పారు. 

దీంతో లీవ్  నగరంలో పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. ఇక, జాపోరిజియాలో శనివారం అర్ధరాత్రి జరిగిన దాడిలో ఓ పౌరుడు చనిపోయారు. డ్రోన్లు, గైడెడ్  ఏరియల్  బాంబులతో రష్యా సైనికు లు దాడి చేశారని రీజనల్  గవర్నర్  ఇవాన్  ఫెదొరోవ్  తెలిపారు.కరెంటు పోవడంతో  73 వేల మంది రాత్రంతా చీకట్లోనే గడపాల్సి వచ్చింద న్నారు. 

డొనెట్స్ క్  ప్రాంతంలోని స్లోవియాన్స్క్  సిటీలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు.  24  బిల్డింగులు నేలమట్టం అయ్యాయని అధికారులు వెల్లడించారు.