
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడాన్ని నిరసిస్తూ ప్రపంచ దేశాలు తనపై ఆంక్షలు విధిస్తుండడంతో రష్యా కూడా చర్యలు తీసుకుంటోంది. తమ గగనతలంలోకి రాకుండా 36 దేశాలకు చెందిన విమానాలపై బ్యాన్ విధించింది. ఇందులో బ్రిటన్, జర్మనీ సహా పలు యురోపియన్ దేశాలు ఉన్నాయి. ఈమేరకు సోమవారం రష్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా దేశాలకు చెందిన విమానాలు రష్యా ఎయిర్‌స్పేస్‌లోకి రావాలంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలని సూచించింది.