ఉక్రెయిన్​ ప్లుటోనియం బాంబు తయారుచేస్తోంది

ఉక్రెయిన్​ ప్లుటోనియం బాంబు తయారుచేస్తోంది
  • రష్యా మీడియా సంస్థల కథనాలు.. కొట్టిపారేసిన ఉక్రెయిన్​

మాస్కో: చెర్నోబిల్​ అణు విద్యుత్​ కేంద్రంలో ఉక్రెయిన్​ ప్రమాదకరమైన ప్లుటోనియం ‘డర్టీ బాంబు’ను తయారు చేస్తోందని రష్యాకు చెందిన పలు మీడియా సంస్థలు వార్తలు రాశాయి. ఉక్రెయిన్​ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. సోవియట్​యూనియన్​ నుంచి విడిపోయిన తర్వాత అణ్వాయుధాలను వదిలిపెట్టేశామని, మళ్లీ న్యూక్లియర్​ క్లబ్​లో చేరే ఆలోచనలేవీ తమకు లేవని స్పష్టం చేసింది.  

ఏంటీ డర్టీ బాంబు​?
డర్టీ బాంబును రేడియోయాక్టివ్​ పౌడర్​, పేలుడు పదార్థాలను కలిపి తయారు చేస్తారని చెప్తారు. అది పేలిన చోట రేడియో యాక్టివ్​ మెటీరియల్​ విడుదలవుతుందని, ఆ రేడియేషన్​తో తీవ్రమైన జబ్బుల ముప్పు తక్కువే అయినా దానిని పీల్చుకుంటే సమస్యలు వస్తాయి. బాంబ్​ రేడియేషన్​తో మనుషులు చనిపోరని, గాయాలు మాత్రమే అవుతాయని మరికొందరు చెప్తున్నారు.  

అణు బాంబు కాదా?
డర్టీ బాంబ్​.. అణు బాంబు కాదని, రెండింటికీ చాలా తేడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. డర్టీ బాంబు కన్నా అణు బాంబు శక్తి కొన్ని లక్షల రెట్లు ఎక్కువుంటుందంటున్నారు. అణు బాంబు ద్వారా విడుదలయ్యే రేడియేషన్​ కొన్ని వేల కిలోమీటర్ల దూరం వ్యాపిస్తుందని చెప్తున్నారు. డర్టీ బాంబ్​ రేడియేషన్​ కొన్ని కిలోమీటర్ల దూరమే వెళ్తుందని అంటున్నారు.