కోమాలో రష్యా ప్రతిపక్ష నేత.. విష ప్రయోగమే కారణం!

కోమాలో రష్యా ప్రతిపక్ష నేత.. విష ప్రయోగమే కారణం!

మాస్కో: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ (44) సిబెరియన్ ఆస్పత్రిలోని ఐసీయూలో ఉన్నారు. నవాల్నీపై విష ప్రయోగం చేసి ఉండొచ్చని ఆయన అధికార ప్రతినిధి చెప్పారు. ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌పై పదే పదే విమర్శలకు దిగే నవాల్నీ ఓ లాయర్‌‌ కావడం గమనార్హం. అలాగే యాంటీ కరప్షన్‌ క్యాంపెయినర్‌‌ కూడా కావడం విశేషం. ఆరోగ్య పరిస్థితి క్షీణించి కోమాలోకి వెళ్లిపోవడంతో మాస్కోలో నవాల్నీ ప్రయాణిస్తున్న ఫ్లయిట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేసి ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు.

‘అసెక్సీపై విష ప్రయోగం చేశారు. ఆయన ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ (ఐసీయూ)లో ఉన్నారు. అది ముమ్మాటికీ కావాలని చేసిన విష ప్రయోగమే’ అని నవాల్నీ అధికార ప్రతినిధి కిరా యర్మిష్ ట్విట్టర్‌‌ వేదికగా ట్వీట్ చేశారు. ఓఎమ్‌ఎస్‌కే ఎమర్జెన్సీ ఆస్పత్రిలో విష ప్రయోగ పేషెంట్స్‌ను చేర్చే ఐసీయూలో నవాల్నీ ట్రీట్‌మెంట్ పొందుతున్నారని స్టేట్ న్యూస్ ఏజెన్సీ అయిన టీఏఎస్‌ఎస్‌ రిపోర్ట్ తెలిపింది. నవాల్నీ వెంటిలేరపై ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సదరు ఆస్పత్రి డిప్యూటీ హెడ్ ఆంటోలీ కలిచెందకో చెప్పారని తెలిసింది.