
ఉక్రెయిన్ లోని మరియుపోల్,వోల్నవోఖ్ నగరాల్లో ప్రజలను తరలించేందుకు వీలుగా కాల్పులు విరమిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. ఈ కాల్పుల విరమణ ఐదున్నర గంటల పాటు పాటిస్తామని రష్యా తెలిపింది అయితే రష్యా మాట తప్పుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది.మరియుపోల్ నగరంలో ఇప్పటికీ రష్యా సేనలు దాడులు చేస్తున్నాయని ఆరోపించింది ఉక్రెయిన్.
రష్యా బలగాలు చుట్టుముడుతుండడంతో పౌరుల తరలింపుకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని మరియుపోల్ నగర అధికారులు చెబుతున్నారు. మరియుపోల్ నగరంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ రష్యా బలగాలు కాల్పుల విరమణను ఉల్లంఘించి దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దీంతో.. స్థానిక ప్రజలను ఖాళీ చేయించే కార్యాచరణను వాయిదా వేసుకున్నామని నగర అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..