గాలిలో క‌రోనాను గుర్తించే డివైజ్.. విడుద‌ల చేసిన ర‌ష్యా

గాలిలో క‌రోనాను గుర్తించే డివైజ్.. విడుద‌ల చేసిన ర‌ష్యా

క‌రోనా వ్యాక్సిన్ తో పాటు గాలిలో వ్యాధికార‌క క్రిముల్ని, ప్ర‌మాద‌క‌రమైన క‌రోనా లాంటి వైర‌స్ ల‌ను గుర్తించి హెచ్చ‌రిక‌లు జారీ చేసే డివైజ్ ను ర‌ష్యా తయారు చేసింది.

మాస్కో సమీపంలో ఆర్మీ క్యాంప్ లో ఆర్మీ 2020 అనే ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు. ఈ ప్ర‌దర్శ‌న‌లో డిటెక్ట‌ర్ బ‌యోగా పిలిచే ఈ ప‌రిక‌రాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టారు.డిటెక్టర్ బయో గా పిలిచే ఈ డివైజ్ పాకెట్ గాడ్జెట్ కాదు రిఫ్రిజిరేటర్ లా ఉంటుంది.

డివైజ్ ను త‌యారు చేసిన సైంటిస్ట్ లు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. గాలిలో వైర‌స్ ఉందా లేదా అనే విష‌యాన్ని గుర్తించేందుకు ప్ర‌దేశాల్ని మార్చాల‌ని అన్నారు. డివైజ్ కు ఉన్న చ‌క్రాల ఆధారంగా ప్ర‌దేశాల్ని మారుస్తూ క‌రోనా వైర‌స్ ను గుర్తించవ‌చ్చ‌ని తెలుస్తోంది.

మొద‌టి ద‌శ‌లో చుట్టుప‌క్క‌ల ఉన్న గాలిని సేక‌రించిన అనంత‌రం 15సెక‌న్ల‌లో వైర‌స్ ఉన్న ఆనవాళ్ల‌ను గుర్తించి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్న‌ట్లు తెలిపారు.