ఉక్రెయిన్‎పై మిసైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా

ఉక్రెయిన్‎పై మిసైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా

ఉక్రెయిన్‌, రష్యా మధ్య 24 రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‎ను చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రష్యన్ దళాలు.. తమ దాడులను మరింత ఉధృతం చేశాయి. అందులో భాగంగా కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ధ్వని కంటే 10 రెట్లు వేగంగా దూసుకుపోయే మిసైళ్లతో రష్యా దాడులకు దిగింది. పశ్చిమాన ఉన్న లవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీపై బాంబుల వర్షం కురిపించాయి. కీవ్, ఖార్కివ్, ఒడెస్సా.. ఇలా ప్రతి చోట తెల్లవారుజాము నుంచే ఎయిర్ రెయిడ్ సైరన్లు మారుమోగాయి. బాంబులతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లాయి. హైపర్‌సోనిక్ ఏరోబాలిస్టిక్ క్షిపణులతో  క్షిపణులు మరియు విమాన మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న గిడ్డంగిని ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా.. ఇప్పటిదాకా రష్యా వెయ్యికి పైగా మిసైళ్లను ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైర్ చేసి ఉండొచ్చని అమెరికా అంచనా వేసింది.

For More News..

నెలలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‎న్యూస్

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్