నెలలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

నెలలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

పంజాబ్‎లో 10 మంది మంత్రులతో కొత్త కేబినెట్ కొలువుదీరింది. అనంతరం కేబినెట్ భేటీ నిర్వహించి.. తొలి సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ యువత కోసం ఖాళీల భర్తీ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ దిశగా ముందడుగు వేసి 25 వేల ఖాళీలకు నోటిఫికేషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీసు శాఖలో 10 వేల ఉద్యోగాలు, ఇతర విభాగాల్లో 15 వేల ఉద్యోగాలకు ఒక నెలలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం భగవంత్ మాన్ తెలిపారు.

‘పంజాబ్ కేబినెట్ ఒక నెలలోపు 25,000 ఉద్యోగ ఖాళీలను భర్తీచేయడానికి నోటిఫికేషన్‌ను ఆమోదించింది. ఎన్నికలకు ముందు మేం వాగ్దానం చేసినట్లుగా.. మన పంజాబ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఆప్ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యత’ అని భగవంత్ మాన్ ఒక ట్వీట్‌లో తెలిపారు.

కేబినెట్ భేటీకి ముందు మంత్రులుగా 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్‎లోని  రాజ్ భవన్‎లో జరిగిన ఈ కార్యక్రమంలో హర్పాల్ సింగ్ చీమా, బల్జిత్ కౌర్, విజయ్ సింగ్లా, లాల్ చంద్, గుర్మీత్ సింగ్, కుల్దీప్ సింగ్, లల్జిత్ సింగ్ భుల్లర్, బ్రహ్మ శంకర్ జింపా, ఆనంద్ పూర్ సాహెబ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్‎గా కుల్తార్ సింగ్ సంధ్వాన్ను నామినేట్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.

For More News..

పాఠశాలల్లో ఏది బోధించినా మాకు అభ్యంతరం లేదు

ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‎న్యూస్

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్