ఫిన్లాండ్ నాటోలో చేరితే తీవ్ర పరిణామాలుంటయ్

ఫిన్లాండ్ నాటోలో చేరితే తీవ్ర పరిణామాలుంటయ్

నాటో కూటమిలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేస్తామని ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నీనిస్టో, ప్రధాని సనామారిన్ ఆదివారం జాయింట్ అనౌన్స్ మెంట్ చేశారు. నాటో సభ్యత్వం అంశంపై చర్చించేందుకు ఇవాళ ఫిన్లాండ్ పార్లమెంట్ సమావేశం కానుంది. పార్లమెంట్ ను సంప్రదించిన తర్వాత.. దరఖాస్తు చేయాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు, విదేశాంగ విధాన కమిటీసభ్యులు నిర్ణయించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 200 మంది సభ్యులు గల చట్టసభలో..  ఎక్కువ మంది ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. అధికారిక సభ్యత్వ దరఖాస్తును బ్రస్సెల్స్ లోని నాటో ప్రధాన కార్యాలయంలో సమర్పిస్తారు. ఫిన్లాండ్ కు రష్యాతో దాదాపు పదమూడు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 75 ఏళ్లుగా సైనిక పరంగా తటస్థంగా ఉంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో.. ఫిన్లాండ్ లో రాజకీయ, ప్రజాభిప్రాయం ఒక్కసారిగా నాటో సభ్యత్వానికి అనుకూలంగా మారింది. మరోవైపు ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరితే తీవ్ర పరిణామాలుంటాయని.. రష్యా పదే పదే హెచ్చరించింది. తాము ఎవరికీ వ్యతిరేకంగా నాటోలో చేరట్లేదని... మీరే దీనికి కారణమయ్యారని.. మాస్కోను ఉద్దేశించి మాట్లాడారు ఫిన్లాండ్ అధ్యక్షుడు నీనిస్టో.