నిఘా శాటిలైట్ పైనే రష్యా నిఘా

నిఘా శాటిలైట్ పైనే రష్యా నిఘా

యూఎస్ ఉపగ్రహాన్ని వెంటాడిన రష్యన్ శాటిలైట్అ మెరికా నిఘా ఉపగ్రహం ‘యూఎస్ఏ 245’నురష్యన్ నిఘా ఉపగ్రహం ‘కాస్మో స్ 2542’దొంగలాగా నక్కినక్కి పోతున్నట్లు వెంటాడిందట. ఒకరోజు, రెండ్రోజులు కాదు.. దాదాపు జనవరి నెలఅంతా అమెరికా శాటిలైట్ ను రష్యన్ శాటిలైట్ వెంటాడిందని చెప్తున్నారు. కాస్మోస్ శాటిలైట్ ను రష్యాగత ఏడాది నవంబర్ లో పంపింది. దానిని అమెరికా ఉపగ్రహం తిరుగుతున్న కక్ష్యలోకే పంపడంతో అమెచ్యూర్ శాటిలైట్ స్పాటర్స్ కు చెప్పలేని ఆసక్తి ఏర్పడింది. అందుకే.. ఈ రెండు శాటిలైట్లను ట్రాక్ చేయడం  మొదలుపెట్టారు. దీంతో రష్యన్ శాటిలైట్.. యూఎస్ నిఘా ఉపగ్రహం వెనకే తిరుగుతూ, దానిని దాదాపు దొంగలాగా ఫాలో అయినట్లుగా గుర్తించారు. ఇది అనుమానాస్పదమే అయినా, ఆ కక్ష్యలో ఇతర శాటిలైట్లు కూడా చాలానే ఉన్నాయని పలువురు అంటున్నారు. ఆ శాటిలైట్ల ఆర్బి టల్ డేటా సీక్రెటేమీ కాదని, అది అందరికీ తెలిసిందేనని పేర్కొంటున్నా రు. కానీ చాలామంది మాత్రం.. నిఘా ఉపగ్రహంపైనే రష్యా నిఘా పెట్టిందంటూ అభిప్రాయపడుతున్నారు.

see more news

జగిత్యాలలో భార్యాభర్తల గొడవ..అడ్డువచ్చిన వ్యక్తిపై కాల్పులు

13 ఏళ్ల నాటి కాయిన్ విలువ రూ.14 లక్షలు