రష్యన్ సైంటిస్ట్ గొంతు కోసిన అగంతకుడు

రష్యన్ సైంటిస్ట్ గొంతు కోసిన అగంతకుడు

రష్యన్ శాస్త్రవేత్త  కోవిడ్ -19 వ్యాక్సిన్ స్పుత్నిక్ విని రూపొందించిన ఆండ్రీ బోటికోవ్ గురువారం మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. ఆయనను బెల్ట్‌తో గొంతుకోసి హత్య చేసినట్లు రష్యా మీడియా కథనాలు తెలిపాయి. బోటికోవ్ (47) గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. 

హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఇదివరకే నిందితునిపై హత్య కేసులు ఉన్నాయి. అయితే, ఈ హత్య ఎందుకు చేశాడు? ఎవరు చేయమన్నారు? అన్న కారణాలు, హత్య చేసిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.