
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మనుషులపై క్లినికల్ ట్రయల్స్‌ను రష్యా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిందని స్థానిక మీడియా ప్రకారం తెలుస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా సెకెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని స్పుత్నిక్ న్యూస్ పేర్కొంది. రష్యాలోని గమెలీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్‌ను గత నెల 18 నుంచి సెకెనోవ్ వర్సిటీ ట్రయల్స్ నిర్వహించిందని సమాచారం. ‘వరల్డ్‌లో తొలి కరోనా వ్యాక్సిన్‌ను సంబంధించిన టెస్టులను సెకనోవ్ వర్సిటీ సక్సెస్‌ఫుల్‌గా వాలంటీర్లపై నిర్వహించింది’ అని ఆ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్, బయోటెక్నాలజీకి డైరెక్టర్‌గా ఉన్న తరసోవ్ స్పుత్నిక్ న్యూస్‌లో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న మొదటి దశ వాలంటీర్లు బుధవారం, సెకండ్ బ్యాచ్ మెంబర్స్ ఈ నెల 20న డిశ్చార్జ్ అవుతారని తరసోవ్ చెప్పారు. అయితే వ్యాక్సిన్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే విషయాలపై మాత్రం ఆయన మాట్లాడలేదని తెలిసింది.