తెల్లజెండాలు చూపితే కాల్పులు ఆపేస్తం 

 తెల్లజెండాలు చూపితే కాల్పులు ఆపేస్తం 

కీవ్: అజోవ్ స్టల్ స్టీల్ ప్లాంటు వద్ద పోరాడుతున్న ఉక్రెయిన్ సోల్జర్లు లొంగిపోయి, తెల్లజెండాలతో బయటకు వస్తే.. మానవతా దృక్ఫథంతో వెంటనే కాల్పులు ఆపేస్తామని శుక్రవారం రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ప్లాంటు అంతటా లేదంటే ఏ వైపు నుంచి అయినా తెల్లజెండాలతో బయటకు వస్తే కాల్పులు జరపబోమని, సురక్షితంగా వెళ్లిపోయేందుకు అనుమతిస్తామని తెలిపింది. కాగా, ఉక్రెయిన్ లో సాధారణ పౌరులపైనా రష్యా దాడులు చేస్తోందని, సాధారణ ప్రజలను చంపడం, స్కూళ్లు, ఆస్పత్రులను ధ్వంసం చేయడం యుద్ధనేరాల కిందికే వస్తుందంటూ శుక్రవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ స్పష్టంచేసింది.