భారత్ లో మూడో వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కి అనుమతి

భారత్ లో మూడో వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కి అనుమతి

భారత్‌లో మూడో వ్యాక్సిన్‌ వినియోగానికి లైన్‌ క్లియర్ అయ్యింది. రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ విని అత్యవసర వినియోగం కింద భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DGCI) గ్రీన్ సిగ్నలిచ్చింది.ప్రస్తుతం భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌కి చెందిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌లను జనవరి నుండి పంపిణీ చేస్తున్నారు. స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను ఆమోదించిన దేశాల జాబితాలో 60వ దేశంగా భారత్‌ చేరిందని రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (RDIF) తెలిపింది. మోడెర్నా, ఫైజెర్‌ వ్యాక్సిన్‌ల తర్వాత స్పుత్నిక్‌ వి కరోనా వైరస్‌ పై 91.6 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని.. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను డా.రెడ్డీస్‌ సంస్థ తయారు చేస్తున్పనట్లు DGCI తెలిపింది. క్లినికల్‌ ట్రయల్స్‌ మూడోదశలో ఉన్న స్పుత్నిక్‌ను భారత్‌లో అత్యవసర వినియోగం కోసం డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ఫిబ్రవరి 19న దరఖాస్తు చేసింది. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటి ( SEC)సోమవారం వ్యాక్సిన్‌ వినియోగానికి సిఫారసు చేసింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను 18-99 మధ్య వయస్సు ఉన్న 1,600 మందిపై ప్రయోగించినట్లు తెలిపింది.