మైక్రో టర్బోజెట్ ఇంజన్ ​తయారు చేసిన ఆర్​వీఎంటీ

మైక్రో టర్బోజెట్ ఇంజన్ ​తయారు చేసిన ఆర్​వీఎంటీ

హైదరాబాద్, వెలుగు: ఏరోస్పేస్ కంపెనీ రఘు వంశీ మెషీన్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా  దేశీయంగా తయారు చేసిన  మైక్రో టర్బోజెట్ ఇంజన్ “ఇంద్ర ఆర్​వీ25: 240ఎన్​”ను  ప్రారంభించింది.  

ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, రక్షణ మంత్రి మాజీ సైంటిఫిక్ అడ్వైజర్,  డీఆర్​డీఓ మాజీ చైర్మన్ సమక్షంలో ఆర్​వీఎంటీ హైదరాబాద్ ఫెసిలిటీలో లైవ్​టెస్టింగ్​ ప్రయోగం జరిగింది.  ఇది భారతదేశం  ఏరోస్పేస్ రంగానికి ఒక గొప్ప విజయమని ఆర్​వీఎంటీ పేర్కొంది. దీనిని చిన్న విమానాల్లో బిగిస్తారని తెలిపింది.