
బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా అవతరించాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. 105 రోజుల పాటు సాగిన ఆటలో పల్లవి ప్రశాంత్ ను విజయం వరించింది. అమర్ దీప్ రన్నరప్ టైటిల్ తో సరిపెట్టుకున్నాడు. పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ దక్కింది.
#PallaviPrashanth is the Season 7 WINNER.
— BiggBossTelugu7 (@TeluguBigg) December 17, 2023
Congratulations ???#Amardeep ended as Runner-up. ??#BiggBossTelugu7 #BiggBossTelugu7GrandFinale #BiggBoss7Telugu #Nagarjuna pic.twitter.com/4ZoIFpWBvI
బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్. ఒక కామన్ మెన్ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి. బిగ బాస్ టైటిల్ కోసం పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీలు పోటీ పడ్డారు. శివాజీ అవుట్ అయ్యారు. దీంతో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ టైటిల్ పోరులో నిలిచారు.
ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. ఒక సాధారణ రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. తన అద్భుతమైన ఆట తీరుతో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.