హ్యాపీ మొబైల్స్​ నుంచి ఎస్ 24 సిరీస్ ఫోన్లు

హ్యాపీ మొబైల్స్​ నుంచి ఎస్ 24 సిరీస్ ఫోన్లు

హైదరాబాద్ , వెలుగు: శామ్​సంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఫోన్ల ను మొబైల్ రిటైలర్ హ్యాపీ మొబైల్స్ అందుబాటులోకి తెచ్చింది.  టాలీవుడ్ నటి శ్రీలీల ఆదివారం వీటిని హైదరాబాద్​లోని సంస్థ స్టోర్లో లాంచ్​ చేశారు. కార్యక్రమంలో సంస్థ సీఎండీ కృష్ణ పవన్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్ పాల్గొన్నారు.  

లైవ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌లేట్, ఇంటర్‌‌‌‌‌‌‌‌ప్రెటర్, చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, ట్రాన్‌‌‌‌‌‌‌‌స్క్రిప్ట్ అసిస్ట్ ఫీచర్లు వీటి సొంతం. శాంసంగ్  ఏఐ కీబోర్డ్‌‌‌‌‌‌‌‌ హిందీతో సహా 13 భాషల్లో రియల్​టైం మెసేజ్​లను అనువదించగలుగుతుంది. కారులో, ఆండ్రాయిడ్ ఆటో ఆటోమేటిక్​ ఇన్‌‌‌‌‌‌‌‌కమింగ్ మెసేజ్​లను తీసుకొని రిప్లైలను సూచిస్తుంది. ఈ ఫోన్ల ధరలు రూ.70 వేల నుంచి మొదలవుతాయి. పలు ఆఫర్లూ ఉన్నాయి.  త్వరలో  మరిన్ని స్టోర్ లను లాంచ్ చేయనున్నట్లు కృష్ణపవన్ చెప్పారు.