వింబుల్డన్‌‌లో మూడో రౌండ్‌‌లోకి సబలెంక

వింబుల్డన్‌‌లో మూడో రౌండ్‌‌లోకి సబలెంక
  • అల్కరాజ్‌‌, నోరి, కీస్‌‌ కూడా.. 
  • యూకీ జోడీ ముందంజ

లండన్‌‌:  బెలారస్‌‌ స్టార్‌‌ ప్లేయర్‌‌ అరీనా సబలెంక.. వింబుల్డన్‌‌లో మూడో రౌండ్‌‌లోకి అడుగుపెట్టింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లో టాప్‌‌సీడ్‌‌ సబలెంక 7–6 (7/4), 6–4తో మారీ బౌజుకోవా (చెక్‌‌)పై గెలిచింది. గంటా 35 నిమిషాల మ్యాచ్‌‌లో బలమైన సర్వీస్‌‌లతో సబలెంక పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. ఐదు ఏస్‌‌లు, మూడు డబుల్‌‌ ఫాల్ట్స్‌‌ చేసిన ఆమె 41 విన్నర్లు కొట్టింది. నాలుగు బ్రేక్‌‌ పాయింట్లలో రెండింటిని కాచుకుంది. 

ఇతర మ్యాచ్‌‌ల్లో మాడిసన్‌‌ కీస్‌‌ (అమెరికా) 6–4, 6–2తో డానిలోవిచ్‌‌ (సెర్బియా)పై, కర్తాల్‌‌ (బ్రిటన్ 6–2, 6–2తో టోమోవా (బల్గేరియా)పై, అన్సిమోవా (అమెరికా) 6–4, 6–3తో జరాజువా (మెక్సికో)పై, ప్యారీ (ఫ్రాన్స్‌‌) 6–4, 6–1తో ష్నైడర్‌‌ (రష్యా), ఒసాక (జపాన్‌‌) 6–3, 6–2తో సినియాకోవా (చెక్‌‌)పై గెలిచి ముందంజ వేశారు. మెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లో కార్లోస్‌‌ అల్కరాజ్‌‌ (స్పెయిన్‌‌) 6–1, 6–4, 6–4తో టార్వెట్‌‌ (బ్రిటన్‌‌)పై, కామెరూన్‌‌ నోరి (బ్రిటన్‌‌) 4–6, 6–4, 6–3, 7–5తో తియాఫో (అమెరికా)పై, బోర్గెస్‌‌ (పోర్చుగల్‌‌) 6–3, 6–4, 7–5 (7)తో బిల్లీ హారిస్‌‌ (బ్రిటన్‌‌)పై, రబ్లేవ్‌‌ (రష్యా) 6–7 (1), 6–4, 7–6 (5), 6–3తో లాయిడ్‌‌ హారిస్‌‌ (రష్యా)పై, కరెన్‌‌ కచనోవ్‌‌ (రష్యా) 1–6, 7–6 (7), 4–6, 6–3, 6–4తో షింటారో మోచిజుకి (జపాన్‌‌)పై, ఫోన్సెకా (బ్రెజిల్‌‌) 6–4, 5–7, 6–2, 6–4తో బ్రూక్స్‌‌బే (అమెరికా)పై, జొకోవిచ్‌‌ (సెర్బియా) 6–1, 6–7 (7), 6–2, 6–2తో ముల్లర్‌‌ (ఫ్రాన్స్‌‌)పై గెలిచారు. మెన్స్‌‌ డబుల్స్‌‌లో ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. స్టార్‌‌ ప్లేయర్‌‌ యూకీ బాంభ్రీ–రాబర్ట్‌‌ గాల్లోవే (అమెరికా) జోడీ రెండో రౌండ్‌‌లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌‌లో 7–6 (10/8), 6–4తో రొమెన్‌‌ ఆర్నెడో (మొనాకో)–మాన్యుయెల్‌‌ గునియార్డ్‌‌ (ఫ్రాన్స్‌‌)పై గెలిచారు. వెటరన్‌‌ రోహన్‌‌ బోపన్న–సాండెర్‌‌ గిలి (బెల్జియం) 3–6, 4–6తో కెవిన్‌‌ క్రావిట్జ్‌‌–టిమ్‌‌ పుయెట్జ్ (జర్మనీ) చేతిలో కంగుతిన్నారు. మరో మ్యాచ్‌‌లో రిత్విక్‌‌ బొల్లిపల్లి–నికోలస్‌‌ బారియాంటోస్‌‌ (కొలంబియా) 4–6, 6–4, 7–6 (13/11)తో అలెగ్జాండర్‌‌ ముల్లర్‌‌ (ఫ్రాన్స్‌‌)–డేవిడ్‌‌ గొఫిన్‌‌ (బెల్జియం)పై  నెగ్గి ముందంజ వేశారు.