శబరిమల అయ్యప్ప దర్శనాలు షురూ

శబరిమల అయ్యప్ప దర్శనాలు షురూ

కేరళ శబరిమలలోని అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకుంది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. మకరజ్యోతి దర్శనం జనవరి 14న ఉంటుంది. ఆ నెల 19 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ప్రతి ఉదయం 4 గంటలకు ఆలయాన్ని తెరిచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులను అనుమతిస్తారు.  ఆ తర్వాత ఆలయం మూసేసి సాయంత్రం 5 గంటలకు తెరుస్తారు. మళ్లీ రాత్రి 10 గంటలకు మూసివేస్తారు.

కాగా, రెండేళ్ల తర్వాత అటవీ ప్రాంతంలోని పెద్దపాదం మార్గాన్ని తెరిచారు. జనవరి 1 నుంచి భక్తులను ఈ మార్గంలో అనుమతిస్తారు. ఎరుమేలి నుంచి ఉదయం ఐదున్నర నుంచి రాత్రి పదిన్నర వరకు ఈ రూట్ లో వెళ్లొచ్చు. నీలక్కల్, ఎరుమేలి దగ్గర దర్శనం కోసం స్పాట్ బుకింగ్ కు అవకాశం ఉంది. వర్చువల్  క్యూ పద్ధతిలో దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు స్లాట్ నిర్ధారణ టికెట్ తోపాటు రెండు డోసుల టీకా ధ్రువీకరణ లేదా RTPCR నెగెటివ్ రిపోర్ట్ వెంట తీసుకెళ్లాలి. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ తమకు సహకరించాలని అధికారులు కోరారు. చిన్న బృందాలుగా ప్రయాణిస్తూ రద్దీని నివారించాలని సూచించారు.

మరిన్ని వార్తల కోసం: 

విశ్లేషణ: ఆడవాళ్లకు ఇంకెన్నాళ్లీ సంకెళ్లు

ముంబైలో మొదటి ఒమిక్రాన్ మరణం

భారీ వర్షాలు.. జల దిగ్బంధంలో చెన్నై