భారీ వర్షాలు.. జల దిగ్బంధంలో చెన్నై 

భారీ వర్షాలు.. జల దిగ్బంధంలో చెన్నై 

చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న సాయంత్రం కొద్దిసేపట్లోనే దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం పడింది. హఠాత్తుగా కురిసిన వర్షానికి చెన్నై సిటీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరదల్లో ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం వర్షం పడటంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. వర్షాల కారణంగా చెన్నై నగరంలోని నాలుగు సబ్ వేలను మూసేశారు. 145 భారీ పంపులు ఏర్పాటు చేసి సబ్ వేలు, లోతట్టు ప్రాంతాల నుంచి నీటిని తొలగించే పనులు మొదలుపెట్టారు.

రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల నుంచి నీటి తొలగింపు, ముంపు ప్రాంత ప్రజల తరలింపు పనులను పర్యవేక్షించారు. వరద సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను విజిట్ చేశారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ చేయాలని ఆదేశించారు. ఇవాళ కూడా తమిళనాడులో వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైతోపాటు కంచిపురం, తిరువల్లూర్, చింగల్ పేట్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

కశ్మీర్లో ఎన్ కౌంటర్: ముగ్గురు టెర్రరిస్టుల హతం

రవీందర్‌ సింగ్‌ను‌‌‌‌‌‌‌ ‌‌పిలిపించుకుని మాట్లాడిన సీఎం

‘అర్జున ఫల్గుణ’పై నమ్మకముంది