టీమిండియా ఓటమిపై సచిన్, సెహ్వాగ్ ఆగ్రహం

టీమిండియా ఓటమిపై సచిన్, సెహ్వాగ్ ఆగ్రహం

ఐదో టెస్టులో టీమిండియా ఓడిపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గెలిచే మ్యాచ్ను కోల్పోవడంపై ఆటగాళ్లపై మండిపడ్డాడు. చెత్త బ్యాటింగ్, అంతకంటే చెత్త బౌలింగ్తో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను ఇంగ్లాండ్కు సునాయసంగా అప్పగించారని అసహనం వ్యక్తం చేశాడు.  

అటు ఇంగ్లాండ్ టీమ్పై సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ జట్టు అద్భుతప్రదర్శన చేసిందని కొనియాడాడు. అసాధ్యం అనుకున్న టార్గెట్ను ఈజీగా ఛేజ్ చేసిందని చెప్పాడు. భారత జట్టు ఓటమికి గల కారణాలను సెహ్వాగ్ విశ్లేషించాడు. ఇంగ్లాండ్ టార్గెట్ ఛేజ్ చేస్తున్న సమయంలో ..భారత బౌలింగ్ మరీ పేలవంగా ఉందన్నాడు. విజయం సాధించాలన్న పట్టుదల, కసి భారత బౌలర్లలో లోపించిందని చెప్పుకొచ్చాడు. అటు ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత బౌలింగ్ చేతిలో తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరిన ఇంగ్లాండ్ టీమ్.. లక్ష్య ఛేదనలో మాత్రం..అద్భుతంగా ఆడిందన్నాడు. వారికి అభినందనలు తెలియజేశాడు. అటు బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో ఓడిన టీమిండియా..లోపాలను సరిదిద్దుకోవాలని సెహ్వాగ్ సూచించాడు.  టాప్ 6  బ్యాట్సమన్లో పుజారా, పంత్ మినహా మిగతా వారంతా విఫలమయ్యారని చెప్పారు. లోయర్ ఆర్డర్లో  జడేజా మాత్రమే రాణించాడని ట్విట్టర్లో ప్రశంసించాడు. 

వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న జో రూట్ను సెహ్వాగ్ ఆకాశానికెత్తేశాడు. ప్రపంచంలోనే అతను మేటి బ్యాట్స్మన్ అని వెల్లడించాడు. సిరీస్లో నాలుగు సెంచరీలు చేయడం మామూలు విషయం కాదని కొనియాడాడు. రూట్ ఒక రన్ మెషిన్ అని సెహ్వాగ్ వెల్లడించాడు. అటు సచిన్ సైతం ఇంగ్లాండ్ను ప్రశంసించాడు. ఆ జట్టు అద్భుతంగా ఆడిందని కితాబిచ్చాడు.  బెయిర్ స్టో, జోరూట్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చాలా సులువైందన్నాడు. చిరస్మరణీయ విజయాన్ని అదుకున్న ఇంగ్లండ్‌ జట్టుకు అభినందనలని సచిన్ ట్వీట్ చేశాడు.

https://twitter.com/sachin_rt/status/1544279719348097025