నాకు సీఎం పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. కానీ..

నాకు సీఎం పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. కానీ..

‘నాకు సీఎం పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. కానీ, అశోక్ గెహ్లాట్ మాత్రం సీఎంగా కొనసాగకూడదు’ అని రాజస్థాన్ డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. గత నాలుగు రోజులుగా రాజస్థాన్ రాజకీయం రసకందాయంగా మారింది. రోజురోజుకూ రాజకీయ వేడి పెరుగుతూ వస్తోంది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ తీవ్ర మనస్పర్థల మద్య ఒకరిపై ఒకరు అధిష్టానికి ఫిర్యాదులు చేసుకున్నారు. సచిన్ పైలట్ తన మద్ధతుదారులతో కొత్త కుంపటి పెట్టారు. అశోక్ గెహ్లాట్ కు దమ్ముంటే అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని సచిన్ సవాల్ విసిరారు. నేడు జరుగుతున్న సీఎల్సీ సమావేశానికి సచిన్ తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరయ్యారు. దాంతో ఆయనపై వేటు వేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం సచిన్ ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా కూడా సచిన్ పైలట్ మెట్టుదిగడం లేదు. చివరకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా సచిన్ తో మాట్లాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. భేటీకి రావాలని పంపిన సందేశాన్ని కూడా సచిన్ పక్కనపెట్టారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో పనిచేసేందుకు సచిన్ ససేమిరా అంటున్నారు. కాగా.. నేడు సమావేశమైన సీఎల్పీ మాత్రం అశోక్ గెహ్లాట్ కే మద్ధతు పలుకుతున్నారు.

For More News..

అంత్యక్రియలైన 5 రోజులకు కరోనా సోకినట్లు గుర్తింపు

బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేది.. హత్యా? ఆత్మహత్యా?

రాజస్థాన్‌‌లో గెహ్లాట్, పైలట్‌‌.. నువ్వా? నేనా?

లాక్డౌన్ పూర్తిగా ఎత్తేద్దాం: కేంద్రం.. మళ్లీ పెడదాం : రాష్ట్రాలు