ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సచిన్

V6 Velugu Posted on Apr 08, 2021

మాస్టర్ బ్లాస్టర్..భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా నుంచి కోలుకున్నారు. సచిన్ కు మార్చి 27న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ముందు జాగ్రత్తగా ముంబైలోని సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత ఆస్పత్రి నుంచి  ఇవాళ(గురువారం) డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని తనే స్వయంగా తెలిపాడు.

అయితే సచిన్ కు ఇంకా కరోనా నెగిటివ్ రాలేదు. దీంతో ఇంట్లోనే మరికొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండబోతున్నట్టు ప్రకటించాడు.
 
ఇండియా లెజెండ్స్ తరుపున రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు ప్రకటించారు. కరోనా సోకిన 6రోజులకు ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరాడు సచిన్.

Tagged Sachin Tendulkar, discharged

More News