' 3BHK ' మూవీపై సచిన్ ప్రశంసలు.. వైరల్ అవుతున్న క్రికెట్ లెజెండ్ పోస్ట్

' 3BHK '  మూవీపై  సచిన్ ప్రశంసలు..  వైరల్ అవుతున్న క్రికెట్ లెజెండ్ పోస్ట్

తమిళ నటుడు శరత్ కుమార్, సిద్ధార్థ్, దేవయాని, మీతా రఘునాథ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ' 3BHK '.  ఈ మూవీ జూలై 4న విడుదలపై బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.  ఇప్పుడు OTTలో అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తోంది. లేటెస్ట్ లో ఈ చిత్రంపై క్రికెట్ దిగ్గడం సచిన్ టెండ్యూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల కాలంలో తన బాగా నచ్చిన చిత్రం ఇదేనంటూ అభిమానులతో పంచుకున్నారు.

ఈ మూవీలో ప్రధానంగా ఒక మధ్యతరగతి కుటుంబం తమ స్వంత ఇంటి కలను ఎలా నెరవేర్చుకుంది, అందుకు వారు పడిన కష్టాలు, అనుభవించిన బాధలను దర్శకుడు శ్రీ గణేష్ చూపించారు. అందుకే ఈ సినిమా విడుదలైనప్పటి నుండి, ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కుటుంబ భావోద్వేగాలను క్యాప్చర్ చేయడంతో ఈ చిత్రం ప్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చింది. 

లేటెస్ట్ గా సచిన్ టెండూల్కర్ సామాజిక మాధ్యమం 'రెడిట్'లో అభిమానులతో మాట్లాడారు. వారికి ఇష్టమైన ఆహారం, ఇటీవల చూసిన సినిమాలు వంటి ప్రశ్నలకు సచిన్ సరదాగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో, చూసిన సినిమాల గురించి అడిగినప్పుడు, "నాకు ఖాళీ సమయం దొరికితే మంచి సినిమాలు చూడటానికి ఇష్టపడతాను. ఇటీవల నేను చూసి ఆస్వాదించిన రెండు సినిమాలు - ఒకటి తమిళ చిత్రం '3BHK', మరొకటి మరాఠీ చిత్రం 'ఆతా థాంబ్యాచా నాయ్'" అని సచిన్ చెప్పారు.

సచిన్ టెండూల్కర్ లాంటి ఒక ప్రపంచ స్థాయి వ్యక్తి తమ సినిమాను మెచ్చుకోవడంపై '3BHK' చిత్ర బృందం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. దర్శకుడు శ్రీ గణేష్ సోషల్ మీడియాలో తన కృతజ్ఞతను తెలిపారు. "ధన్యవాదాలు సచిన్ సార్. మీరు మా చిన్నప్పటి నుంచి హీరో. మీ నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకోవడం మాకు ఒక గొప్ప అదృష్టం" అని పోస్ట్ చేశారు.

సచిన్ లాంటి దిగ్గజం ఒక ప్రాంతీయ చిత్రాన్ని మెచ్చుకోవడం, ఆ సినిమా కథకు, దానిలోని భావోద్వేగాలకు ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రశంసలు '3BHK' సినిమాకు తమిళ ప్రేక్షకులనే కాకుండా, ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడానికి సహాయపడతాయి. ఈ సినిమా కథాశైలికి, మానవీయ కోణానికి దక్కిన గొప్ప గౌరవం ఇది అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సచిన్ ప్రశంసతో ఈ సినిమా ఇప్పుడు మరింతగా జనాల్లోకి వెళ్లనుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.