మా నాన్నకి మాటిచ్చా..  అలాంటివి ఎప్పటికీ చేయను: సచిన్‌ టెండూల్కర్‌

మా నాన్నకి మాటిచ్చా..  అలాంటివి ఎప్పటికీ చేయను: సచిన్‌ టెండూల్కర్‌

సచిన్‌ టెండూల్కర్‌ గొప్ప క్రికెటర్‌ మాత్రమే కాదు.. భారత క్రికెట్‌‌కు అంత కంటే ఎక్కువ. కొందరి అభిమానులు సచిన్‌‌ను దేవుడిలా పూజిస్తారు. తన ఆట.. నడవడిక.. అతన్ని ఆ స్థాయిలో నిలబెట్టాయి. అతను  తీసుకున్నఈ నిర్ణయమే.. అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ. కెరీర్‌ ఆరంభంలో లిటిల్ మాస్టర్ మద్యం, పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయనని తన తండ్రికి ఓ మాటిచ్చాడట. ఆ మాటకు కట్టుబడి నేటికీ అలాంటి వాణిజ్య ప్రకటనలకు నో చెప్తున్నాడట. 

మే 31 'వరల్డ్ నో టొబాకో' డే సందర్భంగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సచిన్ తన తండ్రికి ఇచ్చిన మాటను మరోసారి గుర్తుచేసుకున్నాడు. 'నేను జాతీయ జట్టుకు ఆడడం మొదలెట్టిన రోజుల్లో, వాణిజ్య ప్రకటనల్లో నటించాల్సిందిగా చాలా ఆఫర్లు వచ్చేవి. నేను స్కూల్ నుండి ఇంటికి వెళ్లేసరికి అక్కడ కొందరు నాకోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్లు. ఓ రోజు నాన్న  నన్ను పిలిచి.. నువ్ చాలామందికి రోల్ మోడల్‌. ఎంతో మంది నిన్ను ఫాలో అవుతారు. అందువల్ల నువ్వు పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయకూడదు అని చెప్పారు. అలానే నాన్న అని చెప్పి.. ఆరోజు మా నాన్నకు మాట ఇచ్చా. అందుకే నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటిని మాత్రం ఒప్పుకోలేదు. భవిష్యత్తులో కూడా అలాంటి ప్రకటనల్లో కనిపించను..' అని సచిన్ తెలిపాడు. 

ఇదిలావుంటే తన తండ్రి చనిపోయిన రోజు సచిన్ విదేశీ పర్యటనలో ఉన్నాడు.  తండ్రి మరణవార్త విని స్వదేశానికి వచ్చి అంత్యక్రియలు పూర్తి చేసి తర్వాత మళ్లీ వెళ్ళి సెంచరీ (101 బంతుల్లో 140 పరుగులు) చేసి తన తండ్రికి అంకితమిచ్చాడు అంత గొప్ప ప్రతిభావంతుడు సచిన్. కేవలం పదహారేళ్ళ వయసులో భారత జట్టు లోకి వచ్చి తన సత్తా ఏంటో ప్రపంచదేశాలకు చూపించడమే కాదు.. క్రికెట్ భారతదేశాన్ని తల ఎత్తుకునేలా చేసినటువంటి వ్యక్తి లిటిల్ మాస్టర్. అందుకే యావత్ ప్రపంచం మొత్తం సచిన్‌ను 'ది గాడ్ ఆఫ్ క్రికెట్' అని ముద్దుగా పిలుచుకుంటుంది.

https://twitter.com/NitinSachinist/status/1663906740612603904