
ఇవాళ(గురువారం) నుండి ఆరంభం కానున్న వరల్డ్‌కప్-2019 కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో సచిన్ ఓపెన్స్ అగేన్ అన్న షో ప్రసారం కానున్నది. ఈ రోజు ఓవల్ వేదికగా జరిగే తొలిపోరులో ఆతిథ్య ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సచిన్ కామెంట్రీ ఇవ్వనున్నారు. ఈ షోలో మాజీ మేటి క్రికెటర్లు కూడా ప్యానెల్‌లో ఉంటారు. ఆరు సార్లు ప్రపంచకప్ ఆడిన సచిన్ మొత్తం 2,278 పరుగులు చేశాడు.