ఉలాన్‌బాటర్ (మంగోలియా): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా బాక్సర్లు సచిన్ సివాచ్, విశ్వనాథ్ సురేష్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన 60 కేజీ కేటగిరీ ప్రి క్వార్టర్స్‌లో సచిన్ 4-1తో మంగోలియా బాక్సర్ బుయాన్‌దలై బయార్ఖూపై విజయం సాధించాడు.
50 కేజీ ప్రిక్వార్టర్స్‌లో విశ్వనాథ్ 5–0తో కిర్గిస్తాన్ బాక్సర్ బెక్‌జాత్ ఎర్గెషోవ్‌ను చిత్తు చేశాడు. క్వార్టర్స్‌లో సచిన్.. చైనీస్ తైపీకి చెందిన చెంగ్-వే లీతో విశ్వనాథ్ వరల్డ్ చాంపియన్ సంజార్ తాష్కెన్‌బే (కజకిస్తాన్)తో తలపడనున్నారు.
